అందంగా ఉన్నప్పుడు కుర్రాళ్లకు చూపించాలి.. అమ్మాయిల మీద నూకరాజు కామెంట్స్
on Mar 18, 2025
ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉపేంద్ర గెటప్ లో వచ్చిన నూకరాజు అమ్మాయిల మీద కామెంట్స్ శృతి మించినట్టే అనిపించింది. మౌనిక అనే అమ్మాయి ఈ వారం షోకి కొత్తగా వచ్చింది. నూకరాజు ఆ అమ్మాయిని స్టేజి మీదకు పిలిచేసరికి "ఆ అమ్మాయిని వదిలేయ్" అన్నాడు ఆది. "నువ్వు వదిలేయవయ్యా, మాకేం దొరకట్లేదు" అంటూ నూకరాజు రివర్స్ లో అన్నాడు. తర్వాత ఆ మౌనికను, అన్షుని పిలిచాడు. "వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప ఆర్టిస్టో తెలుసా" అన్నాడు. దానికి ఆది "మౌనికానే" అన్నాడు. "నిజంగానే మౌనికానే గొప్ప ఆర్టిస్ట్..నూటికి నూరు శాతం కరెక్ట్ ఎందుకు అంటే మౌనిక తెలుగింటి పిల్లా ఎలా ఉండాలో అలా పద్దతిగా ఉంది. కానీ అన్షు చూసారా నైట్ డ్రెస్ వేసుకుని వచ్చేసినట్టు ఉంది. అందం ఉన్నప్పుడూ కుర్రాళ్లకు చూపించుకోవాలి, ఆనందాన్ని ఇవ్వాలి...అంతే కానీ ఇలా కప్పుకుంటావా..గాడ్ ఈజ్ గ్రేట్" అన్నాడు. ఇక మౌనిక నీకో విషయం చెప్పాలి. ఆది అన్నయ్య మామూలోడు కాదు. తిన్నగా మటన్ తో కలిపేస్తాడు. నీలాగే ఒక తెల్ల గుంట ఢీ షోకి వచ్చింది." అంటూ అసలు విషయం చెప్పకుండా ఆమెను అక్కడినుంచి పంపించేశాడు.
ఇక నూకరాజు వేసిన ఈ డైలాగ్స్ కి అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఇంద్రజ ఐతే ఇంకా బాగా నవ్వేశారు. తర్వాత లేడీ ఉపేంద్రగా సోమ్య వచ్చి ఆదిని స్టేజి మీదకు పిలిచి "రక్త కన్నీరు" మూవీలోని డైలాగ్స్ తో దుమ్ము రేపింది. "స్నానమే చేయకుండా లోకల్ పెర్ఫ్యూమ్ వేసుకొచ్చిన లేజి ఆది మ్యాన్ ..ఎదో ఒక షోలో ఒక అమ్మాయిని పటాయించుకోవాలి అని కలలు కంటున్నా ఒక మూర్ఖ మ్యాన్. నీకు డజన్ల మంది అమ్మాయిలు కావాలి కానీ నీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేస్తే అక్కడ ఏమీ లేదు. ఏ అమ్మాయి ఎం చేస్తోందో గమనించడంతోనే ఏజ్ వేస్ట్ ఐపోతుంది ముందు పెళ్లి చేసుకో" అంటూ ఉపేంద్రలా బ్రెత్ లెస్ డైలాగ్ ని గడగడా చెప్పి స్టేజిని ఊపేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
